భారీగా పడిపోయిన బంగారం

Gold price declined sharply

Gold price declined sharply

Date:12/06/2019

ముంబై ముచ్చట్లు:

పసిడి ధర మళ్లీ పతనమైంది. హైదరాబాద్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.930 తగ్గుదలతో రూ.33,000కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం పసిడి ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 తగ్గుదలతో రూ.31,100కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర స్వల్పంగా రూ.10 తగ్గుదలతో రూ.39,850కు క్షీణించింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1,333.95 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 14.76 డాలర్లకు ఎగసింది.ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా రూ.32,920 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా నిలకడగా రూ.31,800 వద్ద కొనసాగింది. ఇక కేజీ వెండి ధర రూ.10 తగ్గుదలతో రూ.39,850కు క్షీణించింది.

చాణుక్య ఫస్ట్ లుక్

Tags:Heavy fallen gold

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *