ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా: సిఐ ప్రమోద్ కుమార్
సంతోష్ నగర్ ముచ్చట్లు:
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా ఉంటుందని సిఐ ప్రమోద్ కుమార్ అన్నారు. సోమవారం సంతోష్ నగర్ చౌరస్తాలో మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి కొత్త ట్రాఫిక్ చాలన్ లు అమలు అవుతున్నట్లు తెలిపారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసిన వారికి రూ.1,700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా ఉంటుందని అన్నారు. కావున వహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను మరింత పగడ్బంధీగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
Tags: Heavy fine for violating traffic rules: CI Pramod Kumar

