గన్నవరంఅంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు భారీ విమానం

విజయవాడ ముచ్చట్లు:

గన్నవరం (విజయవాడ) అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు భారీ విమానం వచ్చింది. ఎయిర్‌బస్‌ 340 తొలిసారి విమానాశ్రయంకు రావడం విశేషం. లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం హజ్‌ యాత్రికులను తీసుకెళ్లేందుకు సోమవారం ఉదయం వచ్చింది.ఈ పెద్ద విమానానికి సెరిమోనియల్‌ వాటర్‌ కానన్‌ సలైట్‌తో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత భారీ విమానాల రాకపోకలు వీలు వచ్చింది. ఈ భారీ విమానాన్ని చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. సాధారణంగా విమానంలో 200 మంది వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది..ఈ ఎయిర్‌బస్‌ 340 ఎయిర్‌క్రాఫ్ట్‌లో మాత్రం సుమారు 300 నుంచి 350 మంది ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు.

 

మరోవైపు హజ్‌యాత్రకు యాత్రికులతో మొదటి విమానం బయల్దేరి వెళ్లింది. సోమవారం ఉదయం 8.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, హజ్‌ ఆపరేషన్స్‌ చైర్మన్‌ హర్షవర్ధన్ పచ్చ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ విమానంలో తొలిరోజు 322 మంది వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనల తర్వాత యాత్రకు ముస్లింలు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 692 మంది ముస్లిం సోదరులు హజ్‌ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నట్లు హర్షవర్ధన్‌ తెలిపారు. హజ్ యాత్రకు మొదటి విడతగా 322 మంది వెళ్లగా.. సౌదీ అరేబియా జెడ్డా విమానాశ్రయానికి వీరంతా చేరుకుంటారు.

 

Tags; Heavy flight to Gannavaram International Airport

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *