Natyam ad

శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద

ప్రాజెక్ట్ ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

శ్రీశైలం ముచ్చట్లు:


శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో జలాశయం నిండుకుండలా తలపిస్తుంది.  జూరాల,సుంకేసుల నుండి ఇన్ ఫ్లో అధికంగా ఉండడంతో ఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు గంటగంటకు ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో జలాశయం గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లోగా 1,73,695 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లోగా ఐదు గేట్ల ద్వారా 1,39,915 వేల క్యూసెక్కులు అలానే కుడి,ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,897 క్యూసెక్కులు మొత్తం ఔట్ ఫ్లోగా 2,02,812 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులగా ఉంది అలానే జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.3637 టీఎంసీలుగా ఉంది అయితే వరద భారీగా ఇలాగే కొనసాగితే రేడియల్ క్రేస్ట్ గేట్లలో మరో సాయంత్రానికి ఒకటీ లేదా రెండు గేట్లు ఎత్తనున్నట్లు  నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.

 

Post Midle

Tags: Heavy flood coming to Srisailam reservoir

Post Midle