ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు భారీగా వరద నీరు

తాడేపల్లి ముచ్చట్లు:


ప్రకాశం బ్యారేజి కి వరదనీరు పోటెత్తింది. నాగార్జున సాగర్ నుండి 4 లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీరు చేరుకుంది.శుక్రవారం నీటిమట్టం మరింత పెరిగింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల ను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేసారు. దిగువ గ్రామాల ప్రజలను మైకుల ద్వారా వాలంటీర్స్ సచివాలయ సిబ్బందితో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. పులిచింతల నుంచి 3.74 లక్షల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజ్ కు రాగా.3.67 లక్షల క్యూసెక్కుల వరద నీటిని 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వరద నీటిని విడుదల చేసారు. తాడేపల్లి తహసిల్దార్ కార్యాలయం  కార్పొరేషన్ అధికారులు ఇరిగేషన్ అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్రమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

 

Tags: Heavy flood water downstream from Prakasam Barrage

Leave A Reply

Your email address will not be published.