శ్రీశైలానికి భారీగా వరద నీరు

Heavy flood water to Srisailam

Heavy flood water to Srisailam

Date:06/08/2019

కర్నూలు ముచ్చట్లు:

 

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 2.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 866.8 అడుగులుగా ఉంది. జలాశయ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 129.15గా నమోదైంది.

 

 

 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. హంద్రీనీవాకు 1,031 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులు ఇదే ప్రవాహం కొనసాగినట్లయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 

జూరాలకు భారీ వరద …
ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 2.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2.62 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.690 టీఎంసీలుగా ఉంది.

అటకెక్కిన బీసీ రుణాలు 

 

Tags: Heavy flood water to Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *