Heavy foreign currency notes in Vijayawada

విజయవాడ లో భారీగా విదేశీ కరెన్సీ నోట్లు 

Date:23/10/2020

విజయవాడ ముచ్చట్లు:

అజిత్ సింగ్ నగర్  టర్కీలో ఇటీవల రద్దు చేసిన నోట్లను భారీ మొత్తంలో విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.15 కోట్ల విలువైన టర్కీ దేశ కరెన్సీని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మొత్తాన్ని రూ. 45 లక్షలకు విక్రయించేందుకు మరో ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిందితులు నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని ఆంధ్రపభ కాలనీలో ఉన్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. పట్టుబడినవారిని కడపకు చెందిన జి.మనోహర్ , పశ్చిమ గోదావరికి చెందిన పి.వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు, చిత్తూరుకు చెందిన సుకుమార్ , కర్నూలుకు చెందిన జి.రవికుమార్ లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 15 కోట్ల విదేశీ కరెన్సీ, ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులకు విదేశీ కరెన్సీ ఎలా వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

పోలీసులపై దాడి కేసులో 20 మంది పై కేసు నమోదు

Tags: Heavy foreign currency notes in Vijayawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *