భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

కర్నూలు ముచ్చట్లు :

 

పంచ లింగాల రాష్ట్ర సరిహద్దు సేఫ్ చెక్ పోస్టు లో మంగళ వారం తెల్లవారు జామున సేబ్ సి ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో  వాహనతనిఖీలె చేపట్టారు.  ఆ సమయంలో  తెలంగాణ వైపు నుండి  ఒక  స్కార్పియో  వేగంగా వచ్చింది. అందులో సీట్లు కనపడక పోవడంతో సేబ్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నించారు. వాహనం  ఆపకుండా వెళ్లగా, అనుమానం తో స్కార్పియో ను వెంబడించి పట్టుకున్నారు. ,అందులో తెలంగాణ అక్రమ మద్యము బాటిళ్లు  వున్నట్లు గుర్తించి,స్కార్పియో ను సోదా చెసారు. కూర్చొనే సీట్లన్నీ తొలగించి వాటి స్థానంలో దాచిన  సుమారు 50 కాటన్ బాక్స్ ల్లో 716 బాటిళ్లు తెలంగాణ అక్రమ మద్యము బయటపడింది.  స్కార్పియో వాహనం నడిపిన వ్యక్తి, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Heavy liquor possession in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *