అమరావతి ముచ్చట్లు:
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్ద గొల్లపాలెం వరకు అతివేగంతో అలలు వస్తాయని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Tags: Heavy rain forecast for AP.. Yellow alert issued