దర్శిలో భారీ వర్షం
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో కురిచేడు మండలం బోధనంపాడు సమీపంలో భారీ వృక్షాలు రోడ్లపై విరిగిపడ్డాయి. కురిచేడు దర్శి ప్రధాన రహదారి కావడంతో భోదనంపాడు సమీపంలో వాహనాలు భారీగా నిలిచాయి. రోడ్లపై విరిగిపడ్డ చెట్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రేకుల ఇల్ల పై కప్పులు లేచిపోయాయి. విరిగిపడ్డ చెట్లను తొలగించి వాహనాలను త్వరగా పంపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Tags; Heavy rain in Darshi

