ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షం

ఆదిలాబాద్  ముచ్చట్లు:
ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. బుధవారం  సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జలకళ సంతరించుకుంది.. పలు ప్రాంతాల్లో వర్షంతో పాటు గాలివాన భీభత్సం సృష్టించింది. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లో గాలివాన వాన  బీభత్సం తో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది.. ఉట్నూర్ మండలం కొమ్ముగూడెం, కొత్తగూడెం , చింతగూడ, శంభుగూడ రహదారిపై చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. కొమ్ము గూడాలో గాలివాన బీభత్సం తో ఇంటి కప్పులు  లేచిపోవడంతో నిత్యవసరకులు , ఎరువులు బట్టలు తడిసి ముద్దయ్యాయి. గాలి వాన  ద్వారా మంచిర్యాల రహదారిపై బిర్సాయిపెట్ నుండి ఉట్నూర్ వరకు  రోడ్ పై చాలా చెట్లూ పడడం వలన ట్రాఫిక్ కు కొద్ది సేపు అంతరయం కలగింది. పోలీసులు స్పందించి జేసీబీ  సహాయం తో చెట్లూ తీసి  ట్రాఫిక్ క్లియర్ చేశారు. జిల్లా లో భారీ వర్షం  కురవడంతో రోడ్లపై పలు చోట్ల వరద నీటి ప్రవాహం హాహం పొంగి  పొర్లింది.  రోడ్లు వాగులు వంకలను తలపించేలా వర్షం కురిసింది. బోథ్ మండలం పోచ్చెర గ్రామంలో ఎగువున కురిసిన భారీ వర్షంతో పొచ్చర గ్రామంలో  వరద నీటి ప్రహహం వాగులను తలపించింది… ఇక జిల్లాలో కురుస్తున్న వర్షంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు జలపాతలు జలకళ సంతరించుకున్నాయి.. పొచ్ఛేర, కుంటాల జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి..

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Heavy rain in joint Adilabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *