యాదాద్రిలో భారీ వర్షం
యాదాద్రి ముచ్చట్లు:
భారీవర్షంతో యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి పుణ్యక్షేత్రం సహ పరిసరాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొండ పైన టెంపుల్ పరిసర రోడ్లపై వరదనీరు పొంగి ప్రవహిoచింది. వీక్ ఎండ్ కావడంతో.. భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. తెలవారుతుండగానే భారీవర్షం కురవడంతో.. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారీవర్షంతో వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది.
Tags; Heavy rain in Yadadri

