చింతపల్లిలో భారీ వర్షాలు

అల్లూరి ముచ్చట్లు:


అల్లూరి జిల్లా చింతపల్లి లో మిచౌoగ్ తుఫాన్ ప్రభావం గత మూడు రోజుల నుండి  కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వృక్షం ఒకటి  లంబసింగి ఘాట్ రోడ్ లో రోడ్డుకి అడ్డంగా  నేలకొరిగింది. దాంతో  నర్సీపట్నం చింతపల్లి రహదారిలో కిలోమీటర్ మేర వాహనాలు  నిలిచిపోయాయి. మిఛాంగు తుఫాన్ ఏజెన్సీలో ప్రభావం చూపింది. పలుచోట్ల చెట్లు విరిగి పడుపొవడంతో విద్యుత్ నిలిచిపోయిం.  ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు లేక ఖాళీగా నడుస్తున్నాయి.  నిత్యవసర వస్తువులు తెచ్చుకోవడానికి  ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  పలుచోట్ల  వర్షం   కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.  గిరిజన రైతులు కష్టపడి పండించిన పంట తుఫాన్ కారణంగా నీట ములగడంతోరైతులు ఆందోళన చెందుతున్నారు.

 

Tags: Heavy rains in Chintapalli

Post Midle
Post Midle