ముంబైలో భారీ వ‌ర్షాలు..

అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం

ముంబై  ముచ్చట్లు:

ముంబైలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇవాళ ఉద‌యం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహ‌న‌దారులు తెగ ఇబ్బందిప‌డ్డారు. సియాన్‌, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్ల‌లో రైళ్లు, బ‌స్సు స‌ర్వీసుల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌ల‌పై వ‌ర‌ద నీరు చేరుతోంది. ముంబైలో స్వ‌ల్ప స్థాయి నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాబోయే కొన్ని రోజుల్లో ప‌లు చోట్ల అతిభారీ వ‌ర్షాలు ప‌డే ఛాన్సు ఉన్న‌ట్లు కూడా చెప్పింది. వ‌ర్షాల నేప‌థ్యంలో ఎన్డీఆర్ఎప్ ద‌ళాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ముంబైతో పాటు స‌మీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్‌ ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు.

 

Tags: Heavy rains in Mumbai

Leave A Reply

Your email address will not be published.