తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

Heavy rains in Telangana districts

Heavy rains in Telangana districts

Date:11/08/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లాలో వైరా,ఏన్కుకూర్,కొణిజర్ల,తల్లాడ మండలలొ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పత్తి పొలాలు నీటిలో మునిగి పోయాయి. వైరా రిజర్వాయర్ లోకి భారీగా నీరు వచ్చింది. వైరా రిజర్వాయర్ కు  16.3 అడుగులు నీటి మట్టం చేరుకుంది. కొణిజర్ల మండలం  పెద్దమునగాల గ్రామం లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడతో పంటచేలు నీట మునిగాయి. రైతులు  బిక్కుబిక్కుమంటున్నారు. రైతులు  వారం రోజుల క్రితమే  నాట్లు వేసారు. పెద్ద మునగాల చెరువు పంట పొలాల మీద నుంచి   రోడ్డు పై నుంచి ప్రవాహంచటంతో  వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి.అటు, మంచిర్యాలజిల్లాలో కుడా  : రాత్రి నుంచి భారీ వర్షాలుకురుస్తున్నాయి. శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్ లోని   రామకృష్ణాపూర్,  శ్రీరాంపూర్,  మందమర్రి ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తి  నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గంలో కుడా భారీ వర్షం నమోదయింది. భూపాలపల్లి వెంకటాపురం మండలం,  మాలహర్ రావు మండలం తాడిచర్ల లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి.
Tags:Heavy rains in Telangana districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *