అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావ రణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల బుధవారం భారీ వర్షాలకు అవకాశముందని తెలి పింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, కృష్ణా, పార్వ తీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి, నంద్యాల, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాత్రి 8 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవ లసలో 55.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Tags:Heavy rains in the north coast today!