Natyam ad

యాదాద్రిలో విస్తారంగా వర్షాలు..భారీగా పంట నష్టం

యాదాద్రి ముచ్చట్లు:


యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు రోజులుగా అకాల వర్షం కురుస్తుంది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో మరియు మార్కెట్ యార్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రుద్రవెళ్లి వద్ద, లో లెవల్ రోడ్డు బ్రిడ్జి మీద ప్రవహిస్తున్న మూసి.. బీబీ నగర్ –  పోచంపల్లి మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. బీమ లింగం కత్వా వద్ద కూడా, లో లెవల్ బ్రిడ్జి రోడ్డు మీద మూసి ప్రవహించడంతో  బోలేపల్లి –  చౌటుప్పల్ మధ్య  రాకపోకలు స్థంభించాయి.  మరోవైపు కామారెడ్డి జిల్లా లో భారీ వర్షానికి  రోడ్డు కొట్టుకుపోయింది. కామారెడ్డి -మెదక్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. రాజంపేట మండలం కొండాపూర్- ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య కామారెడ్డి నుంచి మెదక్ వైపు వెళ్లే రోడ్డు కుడా భారీగా దెబ్బ తిన్నది.

 

Tags; Heavy rains in Yadadri..huge crop damage

Post Midle
Post Midle