టీడీపీకి భారీ షాక్

Date07/12/2018
తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు సొంత జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. పీలేరు నియోజకవర్గానికి మొన్నటి వరకూ టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరించిన ఇక్బాల్ మహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతుందీ స్పష్టం చేయకపోయినప్పటికీ ఆయన టీడీపీకి మాత్రం రాజీనామా చేశారు. చంద్రబాబునాయుడు తనను నమ్మించి మోసం చేశారని ఇక్బాల్ ఆరోపిస్తున్నారు.పీలేరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరుపున మహ్మద్ ఇక్బాల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయనే టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని చేర్చుకుని ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడమే కాకుండా నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు. తనను నాలుగున్నరేళ్ల నుంచి పట్టించుకోకుండా అప్పుడే వచ్చిన వారిని అందలం ఎక్కిస్తున్నారని మహ్మద్ ఇక్బాల్ ఆవేదన చెంది పార్టీని వీడినట్లు తెలుస్తోంది. తనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదన్నారు.
Tags:Heavy shock to TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *