భారంగా టిమ్స్ స్పెషాల్టీ ఆస్పత్రులు

హైదరాబాద్ ముచ్చట్లు:

పేదోళ్లకు మెరుగైన వైద్యం అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సర్కార్ పైకి గొప్పలు చెబుతున్నా, వాటిలో ప్రీ వైద్యం అందే ఆస్కారం లేనట్లు కనిపిస్తున్నది. ఆసుపత్రులు కట్టకముందే సర్కార్ అంతర్గతంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిమ్స్తరహాలో ఫీజులు వసూలు చేయాలని ప్లాన్చేస్తున్నది. వచ్చిన ఆదాయాన్ని ఆసుపత్రుల నిర్మాణాలకు తీసుకుంటున్న లోన్లు కట్టేందుకు సర్కార్వినియోగించనున్నది. ఇప్పటికే ఆర్థిక, వైద్యాధికారులు ప్రత్యేక ప్లాన్‌ను సిద్ధం చేశారు. నిమ్స్ అధికారులతో కూడా ఈ అంశాన్ని చర్చించినట్లు ఫైనాన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో అప్పు తీర్చడం అనివార్యం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆఫ్ది రికార్డులో చెప్పారు. దీంతో పేదోళ్లకు ఉచిత వైద్యం అందడం కష్టంగానే కనిపిస్తున్నది. ప్రీ ట్రీట్మెంట్ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మోసం, ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చిన తర్వాత బయటపడనున్నది. దీని బట్టి ఆసుపత్రుల హామీలన్నీ ఎన్నికల స్టంట్‌లో భాగమేనని సెక్రటేరియట్‌లో జోరుగా చర్చ జరగడం గమనార్హం.త్వరలో అందుబాటులోకి రాబోతున్న నాలుగు టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిమ్స్ తరహాలో నడవనున్నాయి. ఓపీ నుంచి టెస్టుల వరకు ప్రతీ దానికీ సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే ఎంత శాతం? వసూలు చేస్తారనే దానిపై ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే స్పష్టత రానుంది. మరోవైపు మందులను కూడా డబ్బులకే విక్రయించాలని ప్లాన్ చేస్తున్నది. ఇన్పేషెంట్, అవుట్పేషెంట్లన్నీ ఫీజుల విధానంతోనే కొనసాగనున్నాయి. ఇక అంబులెన్స్‌లదీ అదే పరిస్థితి. అంటే టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రతీ పనికి డబ్బులు చెల్లించాల్సిందే. దాదాపు ప్రైవేట్ తరహాలోనే వైద్యం అందనున్నది.

 

 

 

అంటే ఈ ఆసుపత్రుల్లో పేదోడి ఎంట్రీకి అడ్డంకిగా మారే ప్రమాదం ఉన్నది.నాలుగు టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తొలుత ఉస్మానియా, గాంధీ తరహాలో ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలుమార్లు అదే హామీ ఇచ్చారు. కానీ, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో అప్పులు తీసుకొని మరి ఈ ఆసుపత్రులు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో ఆసుపత్రికి వెయ్యి కోట్ల చొప్పున నాలుగింటికి రూ.4 వేల కోట్లకు పైగా అవసరంగా అంచనా వేసింది. ఇంత డబ్బు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ప్రత్యేకంగా టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి SBI కన్సర్టిమమ్ సంస్థ నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లకు లోన్లు ఇవ్వాలనుకుంటే, తిరిగి ఏ విధంగా చెల్లిస్తారో? క్లారిటీ తీసుకోవాలని RBI అన్ని బ్యాంక్‌లకు లేఖలు రాసింది. దీంతో SBI కన్సర్టిమమ్సంస్థ ప్రభుత్వం నుంచి క్లారిటీ కోరగా, ఆసుపత్రుల్లో సర్వీస్ ఛార్జీలు వసూల్ చేసి మరీ అప్పు తీర్చుతామని స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేక ఆందోళనలో ఉన్నది. ముఖ్యంగా వైద్యారోగ్యశాఖలోని కొత్త ప్రాజెక్టులు, అండర్ ప్రాసెస్‌లో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు లేక నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. దీనిలో భాగంగానే సుమారు రూ.1100 కోట్లతో నిర్మించే వరంగల్ హెల్త్ సిటీ పెండింగ్‌లో పడింది. అంతేగాక కొత్త మెడికల్ కాలేజీలకూ ఆటంకం వచ్చేలా కనిపిస్తున్నది. అప్పు మీద టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నప్పటికీ వరంగల్ హెల్త్ సిటీ, న్యూ మెడికల్కాలేజీలు ఎలా పూర్తి చేయాలో? అర్థం కాక సర్కార్తల పట్టుకున్నది.

 

Post Midle

Tags: Heavy Tims Specialty Hospitals

Post Midle
Natyam ad