2024 కోసమే ఎత్తులా. 

విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ఎటుగా పడుతున్నాయి? ముఖ్యమంత్రి అలోచనలు ఎటుగా సాగుతున్నాయి? తెలుగు వారి కొత్త సంవత్సరం, ఉగాది నుంచి, కొత్త బాటలో సాగాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారా, అలాగే మద్యంలాగానే, రియల్ దందాను సర్కార్ పరం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారా అంటే, కొంచెం అటూ ఇటుగా అలాంటి ఆలోచనలే జరుగ్తుతున్నాయని, అంటున్నారు.రానునన్ రెండేళ్ళు భూ దందానే ప్రభుత్వ ప్రధాన వ్యాపకంగా ఉంటుంది అంటున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉగాదికి ముందే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోవాలని, తెలుగు సవత్సరం తొలిరోజు నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. అయితే కనీస మౌలిక సడుపాయాలు, అధికారులు, సిబ్బంది పపంకాలు ఏమీ  కాకుండానే రెండు నెలల వ్యవధిలో ‘కొత్త’ ఆలోచనలు ముడి పడతాయా లేదా అనేది అనుమానమే అయినా,అసలు ఈ ఆలోచన వెనక ఉన్న రహస్యం ఏమిటనే ప్రశ్న రాజకీయ  వర్గాల్లో వినవస్తోంది. నిజానికి, కొత్త జిల్లాలు, కొత్త పరిపాలన కంటే, కొత్త రాజధానే ముఖ్యమంత్రి మనసులోని ఆలోచన అని, అందుకే ఆయన ఆరు నూరైనా, నూరే ఆరైనా  ఉగాది నుంచి కొత్త జిల్లాలు కొలువు తీరాలని వెంట పడుతున్నారని, అధికారులు అంటున్నారు. ‘చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన’ అన్నట్లుగా ముఖ్యముఖ్య మంత్రి జగన్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పటు వలన ఇతర ప్రయోజనాల మాట ఎలా ఉన్నా, భూముల ధరలకు రెక్కలోస్తాయి. రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ జనగామా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, జనగామ జిల్లా ఏర్పాటు వలన కరవు జిల్లాలోనూ భూముల ధరలకు రెక్కలోచ్చాయని, మూడు ఎకరాలున్న రైతు కూడా కోటీశ్వరుడు అయ్యాడని పేర్కొన్నారు. అదే విధంగా ఏపీలోను కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలొస్తాయి.
 
 
అందుకోసమే ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.అదలా ఉంటే, ఉగాదికి కొత్త జిల్లాలే కాదు, కొత్త పరిపాలనా  రాజదాని  ‘విశాఖ’ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని కూడా అంటున్నారు. అదే రోజు నుంచి పాలన విశాఖ నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇటీవల ఎంపిక చేసిన సినిమా పెద్దలతో  జరిపిన చర్చల్లో కూడా ముఖ్యమంత్రి విశాఖ ‘రియల్’  ప్రస్తఃవన చేశారు.అంటే, ముఖ్యమంత్రి విశాఖ కేంద్రంగా పని చేసేందుకు, మెల్లి మెల్లిగా ఒక్కొక కార్యాలయాన్ని అక్కడికి  తరలించేందుకు సిద్దమై పోయారని తెలుస్తోంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి కార్యాలయాలను తరలిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు పలుసార్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే, ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయం జరిగిందని అంటున్నారు.  ఏయూలోని ‘విద్యాభవనం’లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేయొచ్చని విశాఖ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.మరో వంక ఇతర కర్యాలయాల కోసం  ప్రైవేటు భవనాలను లీజుకు తీసుకనే పనులు కూడా మొదలయ్యాయి. ఇందుకోసం  తొట్లకొండపై గ్రేహౌండ్స్‌ కార్యాలయం,
 
 
కొన్ని ప్రైవేటు ప్రాంగణాలు ప్రభుత్వ  పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, దాదాపు 200 ఎకరాల్లో కాపులుప్పాడలోని కొండపై అభివృద్ధి ఐటీ లేఅవుట్‌ రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉంచారు. పిఠాపురం కాలనీలో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూడా కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. గంభీరం వద్ద మూసేసిన ఓ ప్రైవేటు కళాశాలలో, మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 10 అంతస్తుల్లోని మిలీనియం టవర్స్‌లో టవర్‌-బి నిర్మాణం చాలావరకు పూర్తయింది. వీటిలో కార్యాలయాలకు ఏవి ఉపయోగపడతాయో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా ఎక్కడో అక్కడ సిద్ధం చేసి ఉంటారని భావిస్తున్నారు. అదలా ఉంటే, ఉగాది రోజున లేదా అంతకంటే ముందుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందని అంటున్నారు. ఉగాదికి కొత్త ఆలోచనలు చేయడం మంచిదే, కానీ, రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టే ఆలోచన ఉగాది రోజు చేస్తునారా,అనేది అనుమానం.
 
Tags: Height for 2024 only.