హెల్మెట్ రక్షణ కవచం …..
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి విలువైన ప్రాణాలు కాపాడుకోండి..
ఎస్పీ రఘవీరారెడ్డి
నంద్యాల ముచ్చట్లు:
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సురక్షితంగా గమ్యాలను చేరాలని నంద్యాల ఎస్పీ రఘవీరారెడ్డి అన్నారు. చాలా ప్రమాదాల్లో తలకు బలమైన గాయం కావడం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ఇందుకు ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడం ,సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.34వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఈ నెల 18 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు జరుగనున్న నేపధ్యంలో నంద్యాల పట్టణంలోని కలెక్టర్ ఆఫీసు వద్దగల వైయస్ ఆర్ కాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం నాడు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి గారు మాట్లాడుతూ 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేశించి, రోడ్డు ప్రమాదలకు గురియైన వాహనాలను గమనిస్తే, వాటిలో ముఖ్యంగా మోటారు సైకిళ్ళు, కార్లు, ఆటోలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ముఖ్యంగా 2022 సం.లో మొదటి సంఖ్యలో ఉన్న మోటారు సైకిళ్ళు రోడ్డు ప్రమాదాలకి గురి కావటానికి, కారణాలను చూస్తే వాటిలో నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వలన 107, హెల్మెట్ లేకుండా 39, రోడ్డు డివైడర్ లను గుద్దుకొని 36, అతివేగం కారణంగా 08, నిలిపి ఉన్న వాహనాలను గుద్దుకొని 06, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన 01, రాంగ్ రూట్ లో వెళ్ళడం వలన 01 ప్రమాదాలకు గురైనారు.యువత అత్యుత్సాహం అతివేగంగా వాహనాలను డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడం బాధకరమన్నారు.
నగరంలో రోజూ రోజూకు జనభా పెరుగుతుందని వాహనాలు కూడా వేల సంఖ్యలో పెరుగుతూ వస్తున్నాయి కాని, రోడ్లు మాత్రం వెడల్పు కావడం లేదన్నారు. దీని వలన వీపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుచున్నాయన్నారు.ప్రతి ఒక్కరూ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు.ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్ లు ధరించి వాహనాలను నడపాలన్నారు. ర్యాస్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, అతివేగంగా నడపడం వంటివి అతిప్రమాదకరమన్నారు. ప్రతి విద్యార్ది మరియు యువత తప్పనిసరిగా మోటర్ వెహికల్స్ చట్టం ప్రకారం నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యాలను చేరగలమనే విషయాలను తెలుసుకోవాలన్నారు.తల్లితండ్రులు తమ పిల్లలకు రహాదారి భద్రత, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియజేయాలన్నారు.
ఎంతో మంది యువత రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు పొగొట్టుకొని వారి కుటుంబానికి జీవితాంతం తీరని శోకం కలిగిస్తున్నారన్నారు. అటువంటి సంఘటనలు ఎవరి కుటుంబాలలో జరగకూడదని నంద్యాల ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ప్రమాద సంఘటనల చిత్రాలను ప్రదర్శించి రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను వివరించారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తప్పవు.
జాతీయ రహాదారుల పై రాంగ్ రూట్ లలో వెళ్ళవద్దు.వాహన దారులు పోలీసుల కోసం కాకుండా వారి కుటుంబసభ్యులను లను దృష్టిలో పెట్టుకొని, వారి భద్రత కోసం హెల్మెట్, సీటు బెల్టులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు, సూచనలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా గమ్యాలకు క్షేమంగా చేరాలని, ప్రాణనష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా, పరిమితికి మించి ప్రయాణీకులు వాహనాల్లో వెళ్ళకుండా పలు జాగ్రత్తలు చేపడితే దాదాపు రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు
జిల్లా మొత్తంలో ఎక్కువ మొత్తంలో రోడ్డు ప్రమాదాలు జరిగే సుమారు 15 ప్రదేశాలను గుర్తించి, వేగ నియంత్రణకు యస్ లోడ్రమ్ములు, బ్యారీకేడ్లు మరియు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి, స్పీడ్ బ్రేకర్లు సూచించేలా వంద మీటర్ల దూరం నుండే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆటో డ్రైవర్లకు, ప్రజలకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, రాత్ర్రి సమయాల్లో “స్టాప్ వాష్ అండ్ గో” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినా , రహదారులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్ 100 కు సమాచారం చేరవేయాలని జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల ఎమ్పీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ,నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి , వెంకటరమణ ,బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ , నాయక్ పాల్గొన్నారు.
Tags: Helmet protection
