జార్ఖండ్ సైనిక కుటుంబాలకు సాయం సరే… తెలంగాణ అమరుల సంగతేమిటి ?

హైదరాబాద్  ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన పై తెలంగాణ వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ఫైర్ అయ్యారు. శుక్రవారం జార్ఖండ్ కు వెళ్లి గల్వన్ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఆర్దిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమర జవాన్ల కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పుకాదు. అలాగే ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పులేదు.కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందుకు సాయం చేయరు?అంటూ షర్మిల ప్రశ్నించారు. 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతు చించుకున్న మీకు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు?అని ప్రశ్నించారు.
Tags:Help for Jharkhand military families … What about Telangana martyrs?

Leave A Reply

Your email address will not be published.