వరద బాధితులకు వెంటనేసహాయం అందిచాలి-మాజీ మంత్రి కళా వెంకట్రావు

విజయవాడ ముచ్చట్లు:


వరద బాధితులు భోజనాలు, ఇతరత్రా సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే వారిపై కూడా వైసీపీ జులుం చేపినస్తుందని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. పశువులకు పశుగ్రాసం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. సంక్షేమ పథకాలు అందించడానికి బటన్ నొక్కే జగన్ .. వరదబాధితుల సహాయం కోసం ఎందుకు బటన్ నొక్కరు?  హుదుద్, తితిలీ తుఫాను సమయంలో చంద్రబాబు చూపిన చొరవ జగన్ లో లేదు.  పండిస్తే కొనేవాడు లేడు, కొంటే డబ్బులిచ్చేవాడు లేడనే నిరుత్సాహంతో నేడు రైతులు ఉన్నారు.  వరద బాధితులకు వెంటనే రూ.10వేలు ఆర్థిక సహాయం అందించాలి.  వరదల్లో దెబ్బతిన్న ఇళ్లను ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అయన అన్నారు.  నిత్యవసర వస్తువులు శిబిరాల్లోనే నిలిచిపోయాయి కావున వంటనూనె, కందిపప్పు, నిత్యవసర సరుకులు మళ్లీ పంపిణీ చేయాలి. ప్రభుత్వం సరఫరా చేసిన 25 కేజీల బియ్యం ఏమూలకు చాలవు కావున 75 కేజీలకు పెంచాలి.  ప్రభుత్వం కళ్లు తెరచి వరద బాధితుల గోడు పట్టించుకోవాలని టీడీపీ డిమాండ్ చెస్తోందని అయన అన్నారు.

 

Tags: Help should be provided to the flood victims immediately-former minister Kala Venkatarao

Leave A Reply

Your email address will not be published.