Natyam ad

మానవత్వం పరిమళించేలా సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్

-ఎవరు లేని వారికి ఆత్మ బంధువులు

– అనాధ మృతదేహానికి దహన సంస్కరాలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్.

 

మదనపల్లి ముచ్చట్లు:

Post Midle

మదనపల్లి పట్టణంలో చిత్తు కాగితాలు ఎరుకుంటు జీవనం సాగించే భార్య భర్తలు…భార్య అనారోగ్యంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.దహన సంస్కరాల కోసం వారి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆమె భర్త తల్లడిల్లిపోయాడు.ఆత్మ బంధువులు గా మేమున్నాం అంటూ అతనికి ధైర్యం చెప్పి,దహన సంస్కరాలకు అయ్యే పూర్తి ఖర్చు భరించి, అంబులెన్స్ మాట్లాడి,హిందు సాంప్రదాయబద్దంగా ఆమె దహన సంస్కరాలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం.కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనా తో పోరాడుతూ తనువు చాలించిన 917 కరోనా మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. మహిళ దహన సంస్కరాలు నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్,సంస్థ సభ్యులు కిరణ్,ఇలియాజ్, పురుషోత్తం,సాంబ పాల్గొన్నారు.

Tags: Helping Minds serving to enrich humanity

Post Midle