పుంగనూరులో నాయిబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడుగా హేమంత్‌కుమార్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ నాయిబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడుగా హేమంత్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం నాయిబ్రాహ్మణ సంఘ సమావేశం త్యాగరాజస్వామి ఆలయంలో నిర్వహించారు. ఉపాధ్యక్షుడుగా తులసిరాం, సెక్రటరీగా సతీష్‌, కోశాధికారిగా బద్రిరమణ, గౌరవ అధ్యక్షులుగా లోకేష్‌కుమార్‌, రమణ, సలహాదారులుగా కొండారాజశేఖర్‌, ఉమాశంకర్‌ లను ఎన్నుకున్నారు. సంఘ ఎన్నికలు జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌, కార్యదర్శి హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సంఘ నాయకులు హాజరైయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్థానిక నాయకులు సన్మానం నిర్వహించారు.

 

Tags: Hemanth Kumar is the president of Nai Brahmin Sangha in Punganur

Leave A Reply

Your email address will not be published.