అణకువైన భార్య పాత్రలో హేమ అద్భుతం

Hemma's wonder in the role of an offensive wife

Hemma's wonder in the role of an offensive wife

Date:30/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎప్పుడూ ఫ్రష్ట్రేషన్‌లో ఉండే భర్తకు అణకువైన భార్య పాత్రలో హేమను అద్భుతంగా తీర్చిదిద్దారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అతడు’ సినిమా ఎన్నిసార్లు వచ్చినా ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టదు. టీవీల ముందు కూర్చుంటే అలా సాఫీగా సాగిపోతుంది. ఇక ఆ సినిమాలో బ్రహ్మానందం – హేమల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఎప్పుడూ ఫ్రష్ట్రేషన్‌లో ఉండే భర్తకు అణకువైన భార్య పాత్రలో హేమను అద్భుతంగా తీర్చిదిద్దారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వాస్తవానికి ఈ సినిమాతో ఆమెకు ఓ ఐడెండిటీ వచ్చిందనే చెప్పాలి. ఆ తరువాత హేమ కోసం త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఓ రోల్‌ని రాసుకునేవారు. అలా అతడు, జులాయి, అత్తారింటికి దారేది చిత్రాల్లో హేమకు మంచి పాత్రల్ని ఇచ్చి.. కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మార్చేశారు త్రివిక్రమ్. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కాని.. సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత తదితర చిత్రాల్లో కనిపించకుండా పోయింది హేమ.
అయితే తాను త్రివిక్రమ్ సినిమాల్లో నటించడం లేదో చెప్పుకొచ్చింది హేమ. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ.. ‘ఏమండీ హేమ గారు వరుసగా త్రివిక్రమ్ సినిమాల్లో చేశారు కదా? ఇప్పుడు ఏమైంది? అంటే తన రెమ్యూనరేషన్ విషయంలో త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఆయన సినిమాల్లో కనిపిండలేదంటూ చెప్పుకొచ్చింది. ‘అసలు త్రివిక్రమ్ ఎవడు నా రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి? సినిమా అంటే ప్రొడ్యుసర్ ఉంటారు. మేనేజర్ ఉంటారు. వాళ్లు మాట్లాడతారు. ఒకవేళ నాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోతే.. అమ్మా మేం అంత ఇవ్వలేం.. ఇష్టమైతే చేయండి.. కష్టమైతే మానేయండి అని చెప్తారు. మధ్యలో ఈయనకు సంబంధం ఏంటి? ఇన్ని సంవత్సరాలు త్రివిక్రమ్‌తో ట్రావెల్ చేసినా ఆయనకు నా మాట మీద నమ్మకం లేదు. అందుకే కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయా. నా ఇగోని హర్ట్ చేయడం వల్ల ఆయనతో మాట్లాడటం మానేశా. ఫోన్ చేయడం మానేశా. ఆయన ఎదురు పడినా పలకరించేదాన్ని కాదు.
నాకు అంతలా మండేలా చేశారు. కడుపు మంటతో చెబుతున్నా’ అంటూ త్రివిక్రమ్‌తో ఉన్న వివాదాన్ని బయటపెట్టారు నటి హేమ. ఇదే ఇంటర్వ్యూలో చాలా చెప్పుకొచ్చారు హేమ.. ‘ఓ సినిమాకి హీరో వల్ల, డైరెక్టర్ వల్ల వంద టిక్కెట్లు తెగితే.. నా వల్ల ఖచ్చితంగా పదిహేను టిక్కెట్లు తెగుతాయ్.. ఆ విషయం డైరెక్టర్‌లకు కూడా తెలుసు. ఇప్పుడు మళ్లీ ‘వినయ విధేయ రామ’ సినిమా నిరూపితం అయ్యింది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులు డైరెక్టర్, ప్రొడ్యుసర్, హీరోతో పాటు నాకూ ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారు. ఈ విషయంలో నేను సక్సెస్’ అంటూ తెగ మురిసిపోతుంది హేమ. ఇంతకీ ‘వినయ విధేయ రామ’ రిజల్ట్ ఏంటన్నది బహుషా హేమకు తెలిసి ఉండదనేది కామన్ ఆడియన్స్ ప్రశ్న.
Tags:Hemma’s wonder in the role of an offensive wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *