భార‌త్ లో అందుబాటులోకి రానున్న మ‌రో నాలుగు కొత్త క‌రోనా వ్యాక్సిన్లు

న్యూఢిల్లీ  ముచ్చట్లు :

భార‌త్ లో త్వ‌ర‌లో మ‌రో నాలుగు కొత్త క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని, రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అందించ‌వ‌చ్చ‌ని నీతి ఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ వీకే పాల్ పేర్కొన్నారు. మ‌రికొన్ని వారాల్లో ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మూడు వారాల్లో రోజుకు 73 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా స‌న్న‌ద్ధమవ్వాల‌ని, ఈ దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల‌ని పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ల‌ ఉత్ప‌త్తిని పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని వివ‌రించారు.మొత్తం వ్యాక్సిన్ ఉత్ప‌త్తిలో 25 శాతం రాష్ట్రాలు సేక‌రిస్తున్నాయ‌ని చెప్పారు. దేశీయంగా త‌యార‌య్యే వ్యాక్సిన్ల‌లో 50 శాతం కేంద్రం సేక‌రిస్తుండ‌గా, ఇందులో 45 ఏండ్ల పైబ‌డిన వారికి ఇచ్చే వ్యాక్సిన్ల‌ను కేంద్రం ఉచితంగా రాష్ట్రాల‌కు అందిస్తోంద‌ని చెప్పారు. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్ల‌ను త‌యారీదారుల నుంచి రాష్ట్రాలు, ప్రైవేట్ ద‌వాఖాన‌లు నేరుగా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంద‌ని అన్నారు. రాష్ట్రాలు సేక‌రించిన వ్యాక్సిన్ల‌లో అవి ప్రాధాన్య‌తా క్ర‌మంలో వ్యాక్సినేష‌న్ ను చేప‌డ‌తాయ‌ని వీకే పాల్ పేర్కొన్నారు. ఈ ల‌క్ష్యాల‌ను అధిగ‌మించేందుకు మ‌నం ఓ వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకోవాల‌ని సూచించారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags: Here are four new corona vaccines available in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *