తెలంగాణ సాగు నీటి కట్టడాలకు హెరిటేజ్ అవార్డు

Heritage Award for Telangana Cultivation Water Stations

Heritage Award for Telangana Cultivation Water Stations

Date:09/10/2018
హైదరాబాద్ముచ్చట్లు:
తెలంగాణ సాగు నీటి కట్టడాలయిన సదర్ మాట్ ఆనకట్ట, కామారెడ్డి పెద్ద చెరువులను జాతీయ వారసత్వ కట్టడాలుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సదర్ మాట్ ఆనకట్ట ను జాతీయ వారసత్వంగా గుర్తిస్తూ ప్రకటించిన హెరిటేజ్ అవార్డును కడెం ప్రాజెక్టు ఈఈ రాజశేఖర్ అందుకోగా, కామారెడ్డి లోని పెద్ద చెరువును వారసత్వ కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెరిటేజ్ అవార్డును మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ అందుకున్నారు. ఈ అవార్డులను సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్   అహ్మద్ అందజేశారు.
సదర్ మాట్ ఆనకట్ట
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని మేడం పల్లి గ్రామ సమీపంలో నేటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన గోదావరి నదిపై  నిర్మించిన ఆనకట్ట సదర్ మాట్. దీని పొడవు 437.388 మీటర్లు. ఈ ఆనకట్ట నుంచి 4.129 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు నిర్మించారు. 127 ఏళ్లుగా సేవలందిస్తోన్న ఈ ఆనకట్టను  ఫ్రెంచ్ ఇంజనీర్ కే. కే ఊట్లే నిర్మించారు.
 కామారెడ్డి పెద్దచెరువు
 కామారెడ్డి పెద్ద చెరువుది 12 దశాబ్దాల చరిత్ర. కామారెడ్డి పట్టణానికి నైరుతిలో ఉన్న ఈ చెరువు ను1897లో ఆరో నిజాం హయంలో నిర్మించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కన్నా ముందే… ఈ చెరువును నిర్మించారు. తాగు నీరు, సాగు నీటి ఇబ్బందులను అధిగమించేందుకు ఆనాటి నిజాం పాలకులు దీన్ని తవ్వారు. మూడు తూములతో అద్బుతంగా నిర్మించిన చెరువు కామారెడ్డి పెద్ద చెరువు.
 జాతీయ వారసత్వ కట్టడాలుగా కేంద్రం గుర్తించి సదర్ మాట్  ఆనకట్టకు, కామారెడ్డి పెద్ద చెరువుకు హెరిటేజ్ అవార్డు  ఇవ్వడం పట్ల ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన సాగు నీటి శాఖ ఇంజనీర్లను అభినందించారు.  ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని, రైతులకు సాగు నీరు ఇవ్వడం ద్వారావారి ఆశీర్వాదాలను అందుకోవాలని ఆకాంక్షించారు.
Tags; Heritage Award for Telangana Cultivation Water Stations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed