జయలలిత పాత్రలో  హీరోయిన్ వరలక్ష్మి

Heroine Varalakshmi in Jayalalithaa's role
Date:21/09/2018
చెన్నై ముచ్చట్లు:
జయలలిత మరణించినప్పటి నుంచి ఆమె బయోపిక్‌ గురించి అనేక మంది ప్రకటనలు చేశారు. తాము జయలలిత జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తామని అనేక మంది మూవీ మేకర్లు ప్రకటిస్తూ వచ్చారు. అయితే వారిలో చాలా మందివి కేవలం ప్రకటనలుగానే మిగిలిపోయాయి. జయలలిత జీవితాన్ని సినిమాగా తీయాలంటే చాలా రకాల ఆటుపోట్లు తప్పవు.
అందుకే చాలా మంది కేవలం ప్రకటనలతోనే సరిపెట్టారు. అయితే తమిళనాట ఇప్పుడు జయ బయోపిక్ ఒకటి పట్టాలెక్కుతోంది. తాజాగా ఆ సినిమా టైటిల్ లోగోను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. జయ బయోపిక్‌కు ‘ది ఐరన్ లేడీ’గా టైటిల్ ఖరారు చేశారు. ఏ స్టోరీ ఆఫ్ రెవల్యూషనరీ లీడర్ అనేది దీనికి ఉప శీర్షిక. ప్రియదర్శిని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ టైటిల్ లోగోను తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విడుదల చేశాడు. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఈ సినిమాలో జయలలిత పాత్రను తమిళ యంగ్ హీరోయిన్ వరలక్ష్మి పోషించనుంది. తమిళ హీరో శరత్ కుమార్ కూతురే వరలక్ష్మి. వివిధ సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు జయలలిత పాత్రను చేయబోతోందట. ‘ది ఐరన్ లేడీ’గా కనిపించనుందట!
Tags:Heroine Varalakshmi in Jayalalithaa’s role

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *