Hersheet lines on the N counter

ఎన్ కౌంటర్ పై హర్షాతిరేఖాలు

Date:06/12/2019

హైదరాబాదు ముచ్చట్లు:

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం హత్య కేసులో ఈ రోజు జరిగిన పరిణామంపై యావత్‌ భారతావని హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తోంది. దిశను అమానుషంగా చంపిన దుర్మార్గులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవటంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ ఘటనపై ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు.ఈ సంఘటనపై తన సోషల్ మీడియా పేజ్‌లో స్పందించిన డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ `సెల్యూట్‌, తెలంగాణా పోలీస్‌ డిపార్డ్‌మెంట్‌కి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే నిజమైన హీరోలు. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని నమ్ముతాను.. మనకి కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే` అంటూ కామెంట్ చేశాడు పూరి.ఈ సంఘటనపై బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కూడా స్పందించాడు. `అదే చోటు అదే సమయం, రాక్షసులు అంతం అయ్యారు. ఇదే నిజమైన న్యాయం.

 

 

 

 

 

 

 

 

 

ఇప్పుడు అలాంటి దుర్మార్గులందరికీ భయం కలుగుతుంది. ఓ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించాలంటే ఒకటి వందసార్లు ఆలోచిస్తారు` అంటూ ట్వీట్ చేశాడు వివేక్‌.టాలీవుడ్ టాప్‌ హీరోలు సైతం ఈ సంఘటనపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఎన్టీఆర్‌, నాగార్జున, అల్లు అర్జున్‌ లాంటి టాప్‌ స్టార్లు కూడా ఈ సంఘటనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాహుబలి సినిమాలో ఆడదాని మీద చేయి వేస్తే నరకాల్సింది. వేళ్లు కాదు తల అంటూ ప్రభాస్‌ చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

 

‘దిశ’ కు న్యాయం జరిగింది.. జనం హర్షాతిరేకాలు

 

Tags:Hersheet lines on the N counter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *