నిఘావర్గాల హెచ్చరికతో ఢిల్లీలో హై అలర్ట్‌

Date:22/06/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కశ్మీర్‌ నుంచి సుమారు ఐదుగురు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో వాహనాలను తనిఖీలు చేయడంతోపాటు అనుమానిత వ్యక్తులను క్రైంబ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అతిథిగృహాలు, ఇతర ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, దవాఖానలపై ప్రత్యేక నిఘా ఉంచామని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్‌ విభాగాలకు హైఅలర్ట్‌ ప్రకటించినట్లు తెలిపారు. భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభనతో భద్రతా దళాలు ఢిల్లీలో ఇప్పటికే నిఘా పెంచాయి.

 

 గోతుల‌ను వెంట‌నే పూడ్చాలి

Tags:High alert in Delhi with intelligence alerts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *