టీ సర్కార్ పై హై కోర్టు ఆగ్రహం

Date:19/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. దీనిపై తదుపరి విచారణను హై కోర్టు రెండు నెలలకు వాయిదా వేసింది. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు రిట్ పిటిషన్‌పై ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ వేస్తారా.. ఆర్డర్ ఇవ్వమంటారా.. అని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేస్తామని సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును కోరింది. 2020 స్థానిక ఎన్నికల్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టు‌లో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో లాటరీ సిస్టమ్ తీసి వేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. బడంగ్ పేటకు చెందిన కోమరేష్ రిట్ దాఖలు చేశారు. దీనిపై గతంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ పిటిషన్ నేడు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. 2 నెలల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు నెలలకు వాయిదా వేసింది.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: High Court angry over Tea Sarkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *