అసెంబ్లీ రద్దుపై హైకోర్టు విచారణ

High Court inquiry on dissolution of Assembly

High Court inquiry on dissolution of Assembly

-బుధవారానికి వాయిదా
Date:08/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ రద్దు పై ధాఖలైన అన్ని పిటిషన్లు ఏకకాలం లో ధర్మసనం సోమవారం విచారించింది. ఇప్పటికే ప్రభుత్వం పై సుప్రీంకోర్టు, హైకోర్టు లో 200 వందల వరకు కేసులు వేశారని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. దాని దృష్టిలో పెట్టుకొని ప్రజా క్షేత్రంలో తెలుచుకుందాం అని ముందోస్తు ఎన్నికలకు వెళ్ళాం అంటూ  ప్రభుత్వం తరుపున న్యాయ వాది తెలిపారు. అసెంబ్లీ రద్దు అనేది ఆర్టికల్ 174 కి విరుద్దమని పిటిషనర్ తన వాదనలు వినిపించారు.  ఎమ్మల్యేలకు తెలియచేయలేదు.  శాసనసభను సమావేశపరచలేదు. ఓటర్లు జాబితా ప్రక్రియపై పూర్తి అయిన తరువాతే ఎన్నికలు నిర్వ యించాలని పిటిషనర్ వాదనలు చేసారు. 2019 జనవరి 1వరకు ఉన్న ఓటర్లు జాబితా సవరణలు ను నవంబర్ 8 కి ఎన్నికలు సంఘం కుదించడం వల్ల 20 లక్షలు మంది ఓటర్లు నష్ట పోయే అవకాశం ఉందని  పిటిషనర్ విన్నవించారు. ఓటర్లు జాబితా సవరణ తరువాతనే ఎన్నికలు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.  ఓటర్లు జాబితా అవకతవకల, అసెంబ్లీ రద్దు పై న్యాయస్థానం బుధవారం మరోసారి విచారణ జరపనుంది.
Tags: High Court inquiry on dissolution of Assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *