పార్టీ మారిన ఎమ్మెల్యేలకు  హైకోర్ట్ నోటీసులు

Date:11/06/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణలో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం తెరాస లోకి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్‌రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, సురేందర్ లు పార్టీ మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు హైకోర్టును ఆశ్రయించారు.  దీంతో మంగళవారం నాడు హైకోర్టు  ఈ వ్యవహారంపై విచారించింది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి నీటీసులు జారీ చేసింది. పార్టీ మారిన పది మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కేసు  విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. స్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.  శాసన మండలిలో విలీనంపై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది.

కడపలో సంపూర్ణ అభివృద్ధి

Tags: High Court notices for party-turned MLAs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *