Natyam ad

మంత్రివిడుదల రజనీ, ఎంపీ అవినాష్రెడ్డి బంధువుకు హైకోర్టు నోటీసులు

అమరావతి   ముచ్చట్లు:

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు యధా స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి విడదల రజనీ ,ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు స్వేతారెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివపార్వతులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దుచేయకుండా గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ ఇవ్వడంపై హైకోర్టులో కొందరు రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పిటిషనర్ తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

Post Midle

మొత్తం 21 ఎకరాల 50 సెంట్లు భూమిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్వోసీ ఇచ్చిన ఎమ్మార్వోకు నోటీసులు వెళ్లాయి. అలాగే రైతులు పనులు చేస్తుంటే అడ్డుకున్న ఎస్సైకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఒక్కో ఎకరాలో 200 కోట్లు విలువ చేసే గ్రానైట్ నిల్వలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రైతులకు తెలియకుండా ఎన్వోసీ ఇవ్వడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేసింది. అప్పటి వరకూ స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్పై కౌంటర్లు దాఖలు చేయాల్సింది మంత్రితో పాటు ఇతరులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Tags;High Court notices to Rajini, MP Avinash Reddy’s relative

Post Midle