కోమటిరెడ్డి,సంపత్ లకు హైకోర్టు ఊరట

Date:17/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ మధుసూధనరెడ్డి నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారి సభ్యత్వాల రద్దును రద్దు చేస్తూ మంగళవారం నాడు  తీర్పు ఇచ్చింది. ఇకపై వారిరువురూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని తీర్పులో స్పష్టం చేసింది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  హైకోర్టు ఆదేశాలతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ల శాసన సభ సభ్యత్వాలు కొనసాగనున్నాయి. ఖమ్మంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తాను చేసిన గోతిలో తానే పడ్డారన్నారు. చేయని తప్పుకు బాధ్యుణ్ని చేసి తనకు మానసిక వేదన కల్గించారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల ఎన్ని కుట్రలు చేసినా తనను ఏమి చేయలేరన్నారు. కె సి ఆర్ డ్రామా ఆడి  పైశాచిక ఆనందం పొందాడు.  చేయని తప్పుకు నా తో పాటు దళిత శాసన సభ్యుడు ని అనర్హత వేటు వేశారని విమర్శించారు.  కేసీఆర్‌లాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని, ఇకనైనా కేసీఆర్ డ్రామాలు కట్టి పెట్టాలని, నెల రోజులపాటు మానసికంగా ఇబ్బందులు పెట్టారని, న్యాయస్థానాలు నాకు రక్షణగా నిలిచాయని కోమటిరెడ్డి అన్నారు. వందమంది కేసీఆర్ లు వచ్చినా నన్ను ఏమి చేయలేరు. నీకు నైతికత ఉంటే రాజీనామా చేయాలని అయన డిమాండ్ చేసారు. టీపీసీసీ నేత  భట్టి విక్రమార్క మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు. ప్రభుత్వ చర్యను తప్పు పట్టిన న్యాయస్థానం తీర్పు కె సి ఆర్ ప్రభుత్వానికి ఘోర అవమానమని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం రాజీనామా చేసిన వ్యక్తి కోమటిరెడ్డి.  లక్ష్యాలు నెరవేరని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉందని విమర్శించారు. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు తీర్పును స్వాగతించారు.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్  కుమార్ ల పదవి బహిష్కరణకు కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు హర్షణీయమని అన్నారు. ఇది ఈ నిరంకుశ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. అప్రజాస్వామిక చర్యలతో ప్రజల, ప్రశ్నించే గొంతులను నులిమి వేయాలని చూస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పతనం మొదలైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుంది. ప్రజల మద్దతు తో ముందుకు పోతుంది. ఎప్పటికైనా గెలుపు మాదే. హై కోర్ట్ తీర్పును తెలంగాణ ప్రజలంతా స్వాగతిస్తున్నారని అన్నారు. అధికార దూరహంకారం తో, విచ్చల విడి చేష్టలతో విర్రవీగి పోతున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ప్రజాస్వామ్య పద్దతిలో పాలన చేయాలని అయన డిమాండ్ చేసారు.  కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్  కుమార్ ల పదవి బహిష్కరణకు కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు హర్షణీయమని అన్నారు. ఈ తీర్పు టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుంది. హై కోర్ట్ తీర్పును  స్వాగతిస్తున్నామన్నారు. అధికార దూరహంకారం తో, విర్రవీగి పోతున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని పాలన చేయాలని అన్నారు.
Tags:High Court relaxed for Komatireddi and Sampath

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *