రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

High Court should be set up in Rayalaseema

High Court should be set up in Rayalaseema

– న్యాయవాదులకు రూ.5 వేలు హ్రర్షనీయం
– ఎంపీ రెడ్డెప్ప

Date:17/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతామని , దీని ద్వారా రాయలసీమ ప్రజలు రుణపడి ఉంటారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ జిల్లాలు పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ విషయమై మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సూచనల మేరకు ముఖ్యమంత్రిని కలసి కోరతామన్నారు.వైఎస్సార్సీపి ప్రభుత్వంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత వాసులతో పాటు ఇటు తెలంగాణ , కర్నాటక, తమిళనాడు ప్రాంతాలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యంగా జూనియర్‌ న్యాయవాదులకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం , నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సీఎం జగన్‌ అన్ని వర్గాలు గూర్చి ఆలోచిస్తూ అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలను చెత్తబుట్టలో దాఖలు చేసిన సీనియర్‌ ముఖ్యమంత్రులు అమలు చేయలేని ఎన్నో పథకాలను జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపి ఎన్నికల మ్యానిఫెస్టోను అన్నిశాఖల అధికారులకు , ప్రజాప్రతినిధుల వద్ద ఏర్పాటు చేసి, అమలు చేసే కార్యక్రమం చేయడం శుభపరిణామమన్నారు. మహాత్మగాంధి 150 సంవత్సరాల క్రితం కలలు కన్న గ్రామ స్వరాజ్య పాలనను వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించడం , అమలు చేసే బాధ్యత పుంగనూరు నుంచి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టడం చరిత్ర సృష్టించడమేనన్నారు. దీని ద్వారా భారతదేశంలో ఆంధ్రర్ఖా•నికి , వైఎస్సార్సీపి ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని తెలిపారు.

వినాయకునికి శంకష్టచతుర్ధశి పూజలు

Tags: High Court should be set up in Rayalaseema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *