రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

High Court should be set up in Rayalaseema

High Court should be set up in Rayalaseema

– అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి

Date:22/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేసి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు. 1937లో రాయలసీమ , కోస్తా ఆంధ్ర ప్రాంతాల మధ్య ఏర్పడిన విబేదాలను పరిష్కరించేందుకే శ్రీబాగ్‌ ఒప్పందం జరిగింది. దీని మేరకు రాయలసీమను అన్ని విధాల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆదాయంతో పాటు ప్రాజెక్టులు రాయలసీమకు సమానంగా కేటాయించాలి. రాజధానితో సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని ఒప్పందం జరిగింది. ఈ మేరకు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడం అత్యవసరం. కాగా హైకోర్టు ఏర్పాటు కోసం ఇప్పటికే సుమారు ఇరవై రోజులుగా రాయలసీమ జిల్లాలోని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి, పోరాటాలకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. లేకపోతే ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అమరావతిలో సచివాలయం, హైకోర్టుతో పాటు అన్ని ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం ఆనాలోచితంగా తాత్కాలిక భవనాల్లో హైకోర్టు ఏర్పాటు చేయడం బాధకరమంటున్నారు. న్యాయవ్యవస్థలో ఇటువంటి చర్యలు ఎక్కడ జరగలేదని వాపోతున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థను పటిష్టంగా కాపాడేందుకు ప్రతి ఒక్కరు ఉధ్యమించాలని కోరుతున్నారు.

హైకోర్టు మార్చడం అవసరం…..

రాష్ట్ర హైకోర్టును రాయలసీమలో తక్షణమే ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం ఆనాలోచితంగా హైకోర్టును హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మార్చడం బాధకరం. దీని కారణంగా న్యాయవాదులు, కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం .విషయమై పోరాటం చేస్తాం.

– పులిరామకృష్ణారెడ్డి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు , పుంగనూరు

జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేయాలి….

రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అభివృద్ధి జాడలేకుండ చేశారు. కనీసం రాయలసీమ జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేసి, అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. న్యాయవాదుల పొరాటం సమంజసం అంటు ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

– కెవి.ఆనందకుమార్‌, న్యాయవాదుల సంఘ కార్యదర్శి , పుంగనూరు

కక్షిదారులను గుర్తించాలి…..

రాయలసీమ జిల్లాల నుంచి విజయవాడలో హైకోర్టుకు వెళ్లాలంటే అధికవ్యయమౌతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హైకోర్టును వెంటనే రాయలసీమలో ఏర్పాటు చేయాలి. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. అలా చేయకపోతే న్యాయవాదుల పోరాటం కొనసాగిస్తాం.

-బి.వెంకటమునియాదవ్‌, న్యాయవాది, పుంగనూరు

అందరి సహకారం అవసరం ….

రాయలసీమ జిల్లాల్లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ పోరాటానికి ప్రజా సంఘాల మద్దతు అవసరం. న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అలా జరిగితే రాయలసీమకు గుర్తింపు లభిస్తూ హైకోర్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

– ఎలినార్‌ ప్రశాంతి, న్యాయవాది, పుంగనూరు.

 

 

వ్యవసాయ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖిలు

Tags: High Court should be set up in Rayalaseema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *