Natyam ad

హైకోర్టు కర్నూలుకు మారదు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్ లో లేదని న్యాయమంత్రిత్వ శాఖ మరోసారి వెల్లడించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో గురువారం లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సమాదానమిచ్చారు. విభజన చట్టానికి అనుగుణంగా 2019లో జనవరిలో ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020 ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపారు. హైకోర్టును కర్నూలుకు మార్చడంపై ప్రభుత్వం, హైకోర్టు తమ అభిప్రాయాన్ని కేంద్ర న్యాయశాఖకు సమర్పించాలన్నారు. ప్రస్తుతం కేంద్రం దగ్గర ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కేంద్రమంత్రి వివరించారు.

 

Post Midle

Tags: High Court will not shift to Kurnool

Post Midle