Natyam ad

తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో భద్రతాపరమైన అంశాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(హోం)  హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్‌ జరిగింది.కోవిడ్ అనంతరం తిరుమలకు యాత్రికులు పెరగడం, వాహనాల రద్దీ పెరగడంతో భద్రతను ఎలా పెంచాలనే విషయమై చర్చించడానికి టిటిడి భద్రతాధికారులు, పోలీసు శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.తిరుమలకు పటిష్టమైన భద్రత కోసం అన్ని దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని శ్రీ హరీష్ కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు. అంతకుముందు, టిటిడి సివిఎస్వో  నరసింహ కిషోర్, తిరుపతి ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన భద్రత, ఇంకా భద్రతను మరింత పటిష్టం చేయవలసిన ప్రదేశాల గురించి తెలియజేశారు.

 

 

Post Midle

అనంతపురం రేంజి డీఐజీ  అమ్మిరెడ్డి, ఓఎస్డీ ఐఎస్ డబ్ల్యూ  శశిధర్ రెడ్డి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.టీటీడీ తరఫున జేఈవో   వీరబ్రహ్మం, సీఈ  నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2  జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శ్రీదేవి, వీజీవోలు బాలిరెడ్డి,  మనోహర్‌, గిరిధర్‌రావుతోపాటు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags:High level review on Tirumala security

Post Midle