Natyam ad

గడప గడపలో సమస్యలకు అధిక ప్రాధాన్యత -కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చే వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని కుమ్మరవీధి, మఖాన్‌వీధి ప్రాంతాలలో చైర్మన్‌ అలీమ్‌బాషా, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి గడప గడపకు నిర్వహించారు. ఈ సంద ర్భంగా జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. పర్యటనలో వచ్చే వినతులను ఆయా సచివాలయాల ద్వారా నమోదు చేయించి, నివేదికలు సిద్దం చేస్తున్నామన్నారు. వ్యక్తి గత సమస్యలకు కూడ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని , నివేదికలు సిద్దం చేసి, మంత్రి పెద్దిరెడ్డికి అందజేస్తామన్నారు. సచివాలయాలకు కేటాయించిన రూ. 20 లక్షల రూపాయలతో ఆయా ప్రాంతాలలో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు రేష్మా, గంగులమ్మ, రెడ్డెమ్మ, కాళిదాసు, భారతి, రాఘవేంద్ర, త్యాగరాజు, అమ్ము, అర్షద్‌అలి, కిజర్‌ఖాన్‌, నరసింహులు, సాజిదా తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: High priority for problems in Gadapa Gadapa – Commissioner Narasimhaprasad Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.