ప్రజా ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత- సర్పంచ్ శ్రీనాథరెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:

 

 

ప్రజా ఆరోగ్యానికే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాలేనత్తం సర్పంచ్ కొండూరు శ్రీనాథరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉంటే అంతకన్నా మహాత్బుగ్యంగా ఉంటారని వైకాపా ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం కరోన వ్యాధిని ఆరోగ్యశ్రీలోకి చేర్చారన్నారు. కరోన మహమ్మారి వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రత్యేకంగా వైద్యశాలలను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా మదనపల్లి శాసన సభ్యులు నవాజ్ బాషా కూడా ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ కరోన మహమ్మారికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరోన ప్రబలకుండా నివారించడం కోసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి మొదటి విడత కరోన వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భారతి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమాదేవి, ఏఎన్ఏం శ్రీవాణి, డిజిటల్ అసిస్టెంట్ బిందు, వెల్పేర్ అసిస్టెంట్ క్రిష్ణప్ప, మహిళా పోలీస్ లక్ష్మీ, ఆశ వర్కర్లు భూదేవి, రెడ్డెమ్మ తదితర వాలింటర్లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: High priority is given to public health – Sarpanch Srinath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *