పుంగనూరులో దళితుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
దళితుల సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధ్యాన్యత కల్పించాల్సిందిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సమావేశాన్ని తహశీల్ధార్ పి.సీతారామన్ నిర్వహించారు. ఇందులో కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి అతిధులుగా పాల్గొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయానికి కేటాయించిన రూ.20 లక్షల నిధులలో అధిక ప్రాధాన్యత కల్పించి పరిష్కరిస్తామన్నారు. అలాగే అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు తక్షణమే ఇంటి పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేసిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు ప్రభాకర్‌నాయక్, బాను, రాజా, అశోక్, శ్రీనివాసులు, చెన్నరాయుడు, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags: High priority to solve the problems of Dalits in Punganur – MPP Bhaskar Reddy
