High yield of peanuts

వేరుశెనగ అధిక దిగుబడి

Date:22/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలో వేరుశెనగ పంట అధిక దిగుబడినిచ్చిందని ఏవో సంధ్య తెలిపారు. మంగళవారం ఆమె మండలంలో భీమగానిపల్లెలో వేరుశెనగ పంట ఒబ్బిడిలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలయ్య అనే రైతు వేరుశెనగ పంటను పరిశీలించారు. పంట దిగుబడి 5 మీటర్లకు గాను 11 కేజిల శెనగకాయలు రావడం జరిగిందన్నారు. దీని ద్వారా ఎకరాకు 22 నుంచి 26 బస్తాల వేరుశెనగ కాయల పంట దిగుబడి వచ్చిందన్నారు. సాధారణ దిగుబడి కంటే ఈసారి 20 శాతం అధిక దిగుబడులు వచ్చిందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు బాలయ్య ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడి వేరుశెనగ విత్తనాలతో పాటు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన జిఫ్సం ఎరువులతో వేరుశెనగ పంట పండించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో జయంతి, రైతులు బాస్కర్‌, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ శివకు అబ్ధుల్‌కలామ్‌ అవార్డు

Tags: High yield of peanuts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *