Natyam ad

విద్య తోనే ఉన్నత శిఖరాలు

బద్వేలు ముచ్చట్లు:విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించడం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని యర్రగొండ పాలెం లోని నలంద విద్యా సంస్థల అడ్మినిస్ట్రేటర్ పెమ్ము సాయి చంద్రహాస రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గ్రంధాలయంలో జరుగుచున్న ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గ్రంధాలయానికి వచ్చిన విద్యార్థులకు కథలు చెప్పడం, పుస్తకాలు చదవడం, పాటలు పాడడం వంటి పోటీలు నిర్వహించారు. విజేతలతో పాటు గ్రంధాలయానికి వచ్చిన ప్రతీ విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రహాస రెడ్డి మాట్లాడుతూ సెలవు దినాలలో సైతం జన విజ్ఞాన వేదిక నాయకులు దాదాపీర్, ఖాసీం వల్లి చొరవ తీసుకొని విద్యార్థులను గ్రంధాలయానికి రప్పించి వారిలో పుస్తక పఠనాభిలాషను కలిగించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకుని విజ్ఞాన వంతులై ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. గ్రంధాలయానికి త్వరలోనే కొన్ని పుస్తకాలను అందజేస్తానన్నారు.అలాగే గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఆఫ్రిది, జె. వి.వి నాయకులు ఖాసీం వల్లి,రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్, పాఠకులు మనోహర్, పీర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Higher peaks with education

Post Midle
Post Midle