Natyam ad

కంది పంటలో సస్య రక్షణ చర్యలతో అధిక దిగుబడులు

మద్దికేర ముచ్చట్లు:

కంది పంటలో సస్య రక్షణ చర్యలతో అధిక దిగుబడులను సాధించవచ్చని మద్దికేర మండల వ్యవసాయ అధికారిని హేమలత తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్నకంది పూత దశలో ఉందని,ఈ సమయంలో చీడపీడలు పంటను ఆశ్రయించే అవకాశం ఉందని,కనుక ముందు జాగ్రత్తగా సస్య రక్షణ చర్యలు చేపడితే పంటను కాపాడుకోవటంతో పాటు అధిక దిగుబడులుసాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారిణి హేమలత రైతులకు సూచించారు.ఆకు చుట్ట పురుగుఈ పురుగు ఆకు,పూతను తిని వేస్తుంది.ఈ పురుగు నివారణకు క్లోరోపీరిఫాస్ 2 మిల్లి లీటర్లు ఒకలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మారుకా మచ్చల పురుగుఈ పురుగు పూత దశ నుండి దాడి చేస్తుంది. లేత ఆకుల చివరలో రెక్కల పురుగులు గుడ్లు పెడతాయి.అవి లార్వాగా మారి లేతపువ్వులను గూడుగా చేసుకుని పూల లోపలి బాగాల్ని తినివేస్తుంది.రెండు రోజుల్లో పూత మొత్తం రాలి పోతుంది.ఈ పురుగు నివారణకు పూత దశలో తప్పనిసరిగా వేపనూనె 3 మిల్లి లీటర్లు లీటర్ నీటికికలుపుకొని పిచికారీ చేసుకోవాలి.తర్వాత నోవాలురాన్ ఒక మిల్లి లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొవడం ద్వారా ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చును.కాయ తొలుచు పురుగుఇదిపూత,పిందె దశల్లో ఎక్కువగా దాడి చేస్తుంది.కాయలోనికి వెళ్లి కాయ లోపటి గింజలను తినివేస్తుంది.ఈ పురుగు నివారణకు ఫ్లూబెందమైడ్ 0.3 మిల్లి లీటర్లు లేదా ఏమామేక్టిన్ బెంజోఎట్ 0.3 గ్రాములు ఒక
లీటర్ నీటికి కలుపుకొని ఈ పురుగును నివారించుకోవచ్చని మండల వ్యవసాయ అధికారిని హేమలత రైతులకు తెలియజేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు,సలహా మేరకు పురుగులను అరికట్టిఅధిక దిగుబడులను పొందవచ్చని ఏవో హేమలత రైతులకు తెలియజేశారు.

 

Tags: Higher yields with plant protection measures in mustard crop

Post Midle
Post Midle