Natyam ad

హిందూముస్లింలు ఇలా ఉండాలనేదే కోరిక

– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

కులమతాలకతీతంగా హిందూముస్లింలు సోదరబావంతో ఇలాగే కలిసిమెలసి ఉండాలన్నదే మా అభిమతమని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రభు, రమణ, సలీం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన యూత్‌ సభ్యులు 30 మంది మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హిందూముస్లిం ఆత్మీయ సమావేశాన్ని వారు ఏర్పాటు చేశారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పార్టీలకు అధికారం వస్తే ఇలాంటి ఆత్మీయ సమావేశాలు కనుమరుగౌతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కులమతాలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి , ముస్లిం, క్రిష్టియన్‌, హిందూవులకు అన్ని విధాల రక్షణ కల్పించి, చర్చిలు, మసీదులు, ఆలయాలను అభివృద్ధి చేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి రెండవ సారి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు హిందూముస్లిం సోదరులు ఐకమత్యంతో ప్రచారాలు చేసి ఓట్లు వేయించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, కౌన్సిలర్‌ సుప్రియ, మక్కా కమిటి డైరెక్టర్‌ ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Hindu-Muslims wish to be like this

Post Midle