తిరుమలలో హిందూ సంస్థల అందోళన 

Hindu organizations in Tirumala

Hindu organizations in Tirumala

Date:19/05/2018
తిరుపతి ముచ్చట్లు:
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీటీడీలో అధికారుల పెత్తనంతో అవకతవకలు జరిగాయని , దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేసాయి. తిరుపతి లో టీటీడీ పరిపాలన భవనం ఎదుట శ్రీవారిని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఆలయ అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై శ్రీవారి భక్తులకు సందేహాలు ఉన్నాయని, వెంటనే శ్రీవారి ఆలయంలో ఏం జరుగుతోంది బహిర్గతం చేయాలన్నారు. అన్యమతస్థుడు పుట్ట సుధాకర్ యాదవ్ ని టీటీడీ ఛైర్మన్ గా నియమించిన కొద్దీ రోజుల్లోనే ఎటువంటి విచారణ జరిపించకుండ ఆలయ ప్రధాన అర్చకులపై వేటు వేయడంపై మతలబు ఎంటో అర్థం కావటం లేదన్నారు.
Tags: Hindu organizations in Tirumala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *