Hindu Religion is a Concern for Propaganda

హిందూ ధ‌ర్మ విస్తృత ప్ర‌చారానికి శంఖారావం

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి

Date:07/12/2019

తిరుపతి ముచ్చట్లు:

10 వేల మంది విద్యార్థుల‌తో సామూహిక గీతాపారాయ‌ణం

తిరుప‌తిలో ఘ‌నంగా గీతా జ‌యంతి

హిందూ స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రింత విస్తృతంగా ప్ర‌చారం చేసేందుకు ఈ వేదిక నుండి శంఖారావం పూరిస్తున్నామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో శ‌నివారం టిటిడి విద్యాసంస్థ‌లు, ఇత‌ర పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 10 వేల విద్యార్థుల‌తో సామూహిక గీతా పారాయ‌ణం నిర్వ‌హించారు. టిటిడి విద్యాసంస్థ‌లు, ఇస్కాన్‌, ఇత‌ర ధార్మిక సంస్థ‌ల స‌హ‌కారంతో టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ గీతాజ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ భ‌గ‌వ‌ద్గీత గొప్ప‌త‌నాన్ని భావిభార‌త పౌరులైన విద్యార్థుల‌కు తెలియ‌జేసేందుకు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించామ‌న్నారు. ఇంత పెద్ద సంఖ్య‌లో విద్యార్థిని విద్యార్థులు సామూహికంగా గీతా పారాయ‌ణం చేయ‌డం విశేషమ‌న్నారు. ఈ విధంగా, విద్యార్థుల‌ను ప్రోత్స‌హించిన త‌ల్లిదండ్రుల‌కు, శిక్ష‌ణ ఇచ్చిన ఉపాధ్యాయుల‌కు అభినంద‌న‌లు తెలిపారు. విద్యార్థులంద‌రికీ భ‌గ‌వంతుని ఆశీస్సులు ఉండాల‌ని కోరారు.

 

 

 

 

 

 

గీత‌లో సైన్స్, టెక్నాల‌జీకి సంబంధించిన ప‌లు అంశాలున్నాయ‌న్నారు. జీవితంలో ఉన్న‌త స్థానానికి చేరుకునేందుకు ఎలాంటి కృషి చేయాలి, ఎలా ఆలోచించాలి అనే విష‌యాలు గీత‌లో ఉన్నాయ‌ని, విద్యార్థులు వీటిని గ్ర‌హించాల‌ని కోరారు. ప్ర‌తి ఇంట్లో భ‌గ‌వద్గీత ఉండేలా, గీతా పారాయ‌ణం జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. టిటిడిలో అన్య‌మ‌త ప్ర‌చార‌మంటూ జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేసేందుకు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లితో పాటు అధికార యంత్రాంగం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఇంత చ‌క్క‌టి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన తిరుప‌తి జెఈఓ పి.బ‌సంత్‌కుమార్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

 

 

బాధ్య‌త‌ను గుర్తు చేసేదే భ‌గ‌వ‌ద్గీత : డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

భ‌గ‌వ‌ద్గీత బాధ్య‌త‌ను గుర్తు చేసి క‌ర్త‌వ్యాన్ని బోధిస్తుంద‌ని తుడ ఛైర్మ‌న్‌, చంద్ర‌గిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు స‌భ్యులు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అన్నారు. మాన‌వుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడ‌దు అన్న విష‌యాలను గీత‌లో భ‌గ‌వంతుడు తెలియ‌జేశాడ‌న్నారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లో తాను ప‌దేళ్ల‌పాటు చ‌దువుకున్నాన‌ని, ఎస్వీ హైస్కూల్ మైదానంతో త‌న‌కు ఎన‌లేని అనుబంధం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. తిరుప‌తి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ మాట్లాడుతూ ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేసిన అన్ని విభాగాల అధికారుల‌కు, టిటిడి విద్యాసంస్థ‌ల ప్రిన్సిపాళ్ల‌కు, అధ్యాప‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ‌, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఇస్కాన్ ప్ర‌తినిధి  వైష్ణ‌వాంఘ్రి సేవ‌క్ దాస్‌, వికాస త‌రంగిణి సంస్థ అధ్యక్షులు డా. నాగేంద్ర‌సాయి, భార‌తీయ విద్యాభ‌వ‌న్ ప్ర‌తినిధి  స‌త్య‌నారాయ‌ణ‌రాజు త‌దిత‌రులు ప్ర‌సంగించారు.

 

 

 

 

 

గోవింద‌నామాల‌తో ప్రారంభం…

ముందుగా శ్రీ స‌త్యసాయి సేవా సంస్థకు చెందిన  శ్రీ‌ధ‌ర్‌, ఫ‌ణిరంగ‌సాయి త‌దిత‌రులు గోవింద‌నామాల‌ను విద్యార్థుల‌తో ప‌లికించారు. విద్యార్థులు ఎంతో భ‌క్తిభావంతో ఈ నామాల‌ను ప‌లికారు. ఆ త‌రువాత శ్రీ లీలాకుమారి ఆధ్వ‌ర్యంలో బ్ర‌హ్మ‌కుమారీలు విద్యార్థుల‌తో ఓంకారం ప‌లికించారు. ఎస్వీ సంగీత క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి శ్రీ‌కృష్ణుడిపై అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ను ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ భ‌గ‌వ‌ద్గీత ప్రాశ‌స్త్యాన్ని తెలియ‌జేశారు. గీత మాన‌వ‌త్వం నుండి దైవ‌త్వానికి న‌డిపిస్తుంద‌ని వివ‌రించారు.

 

 

 

సామూహిక గీతాపారాయ‌ణం…

ఎస్వీ వేద వ‌ర్సిటీ, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌కు చెందిన సుమారు 30 మంది వేద విద్యార్థులు సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ‌లో భ‌గ‌వ‌ద్గీత‌లోని 15వ అధ్యాయ‌మైన పురుషోత్త‌మ ప్రాప్తి యోగంలోని 20 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. వీరిని విద్యార్థిని విద్యార్థులు అనుస‌రించి సామూహికంగా పారాయ‌ణం చేశారు. ఆ త‌రువాత విశాఖ‌లోని శ్రీ స‌త్య‌సాయి సేవా సంస్థ‌కు చెందిన ఆధ్యాత్మిక‌వేత్త శ్రీ‌మ‌తి సాయి ప్ర‌స‌న్న ఈ శ్లోకాలకు వివ‌ర‌ణ ఇచ్చారు. పురుషోత్త‌మ ప్రాప్తి యోగం భ‌గ‌వ‌ద్గీత‌కు క‌ర‌దీపిక లాంటిద‌న్నారు. భ‌గ‌వ‌ద్గీత స‌ర్వ ఉప‌నిష‌త్తుల సార‌మ‌ని, విన్నా, చ‌దివినా జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌ని తెలియ‌జేశారు.

 

 

 

 

 

 

విద్యార్థులు ర్యాలీగా వేదిక వ‌ద్ద‌కు…

సామూహిక గీతా పారాయ‌ణం కోసం టిటిడికి చెందిన డిగ్రీ, జూనియ‌ర్ క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల విద్యార్థులు ర్యాలీగా గోవింద‌నామాలు ప‌లుకుతూ ఎస్వీ హైస్కూల్ మైదానంలోని వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. విద్యార్థుల గోవింద‌నామాల‌తో న‌గ‌రం ఆధ్యాత్మికశోభ సంత‌రించుకుంది. ఈ కార్యక్ర‌మంలో టిటిడి బోర్డు స‌భ్యురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, విద్యాశాఖాధికారి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, డెప్యూటీ ఈఓ విజ‌య‌సార‌ధి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి.విశ్వ‌నాథ్‌, శ్వేత సంచాల‌కులు రామాంజులురెడ్డి, హెచ్‌డిపిపి ఏఈవో నాగేశ్వ‌ర‌రావు, టిటిడి విద్యాసంస్థ‌ల ప్రిన్సిపాళ్లు, అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఆ ఫ్లాప్ మూవీలోనే పవన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు

 

Tags:Hindu Religion is a Concern for Propaganda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *