కృష్ణాష్టమి  విశిష్టత గురించి  హైందవులు  తప్పకుండా తెలుసుకోవాలి

Date:11/08/2020

నెల్లూరు  ముచ్చట్లు:

శ్రీ కృష్ణాష్టమి  విశిష్టతను  హైందవులు  తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని  శ్రీ శ్రీ శ్రీ  శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పూజారి  సంజీవ రావు  పేర్కొన్నారు . ఆయన తెలిపిన వివరాల మేరకు హిందూ మతంలోని అతి ముఖ్యమైన పండుగలలో కృష్ణ జన్మాష్టమి కూడా ఒకటి. కృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు.

చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. ప్రతి ఏడాది శ్రావణ బహుళ అష్టమి తిథిన ఈ అష్టమి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 11 న మంగళవారం – భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంతో, ఉత్సాహంగా జరుపుకుంటారు.

 

బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ 2024లో జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నేత

Tags:Hindus must know about the uniqueness of Krishnashtami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *